Mon Mar 09 2026 12:02:56 GMT+0530 (India Standard Time)
రూపాయి నోటు చూపితే.. ఖరీదైన షూ..ఎగబడిన జనం
రూపాయికే బ్రాండెడ్ షూలు ఇస్తామన్న ప్రకటనతో ఒక్కసారిగా ప్రజలు దుకాణానికి తరలి వచ్చారు

రూపాయికే బ్రాండెడ్ షూలు ఇస్తామన్న ప్రకటనతో ఒక్కసారిగా ప్రజలు దుకాణానికి తరలి వచ్చారు. దీంతో ప్రజలపై పోలీసులు లాఠీఛార్జి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేరళలోని కోళీకోడ్ లో కేవలం రూపాయికే షూలు ఇస్తామని ఒక దుకాణం యజమాని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేశారు. రూపాయి నోటు ఇస్తే చాలు వెంటనే జత షూలు ఇస్తామని తెలిపారు.
పోలీసులు లాఠీ ఛార్జి...
దీంతో ప్రజలు ఎగబడ్డారు. ముఖ్యంగా యువకులు, పెద్దలు, మహిళలు ఇలా తేడా లేకుండా తరలి రావడంతో ఒక్కసారిగా రద్దీ ఏర్పడింది. తెల్లవారు జామున రెండు గంటల నుంచే దుకాణం వద్దకు క్యూ కట్టారు. వారిని నియంత్రించడం పోలీసులకు కష్టంగా మారింది. చివరకు లాఠీ ఛార్జి చేసి ప్రజలను అక్కడి నుంచి తరిమి కొట్టాల్సి వచ్చింది. షాపు యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story

