Sat Mar 07 2026 21:53:20 GMT+0530 (India Standard Time)
జూన్ 24 నుంచి పార్లమెంటు సమావేశాలు
జూన్ 24వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

జూన్ 24వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. లోక్సభభ ఎన్నికలు పూర్తయిన తర్వాత తొలి పార్లమెంటు సమావేశాలు జరుగుతుండటంతో ఈ సమావేశాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసారి కూడా విపక్షం కూడా బలంగా ఉండటం ఈ సమావేశాల ప్రత్యేకత అని చెప్పాలి.
మూడో తేదీ వరకూ...
జూలై మూడు వరకు కొనసాగుతున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతాయని తెలసింది. తొలి రెండు రోజులు నూతన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం స్పీకర్ ఎన్నిక కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ పార్లమెంటు సమావేశాలకు సంబంధించి అనేక ఆసక్తికరమైన విషయాలు ఉండనున్నాయి.
Next Story

