Tue Mar 10 2026 11:06:21 GMT+0530 (India Standard Time)
Loksabha : నేడు స్పీకర్ పై అవిశ్వాసం చర్చ
నేడు రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి

నేడు రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. నేడు స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం సహా పలు బిల్లులపై చర్చ జరగనుంది. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం చర్చను మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభిస్తారు. అనంతరం అవిశ్వాసం పై చర్చ జరగనుంది. హోం మంత్రి అమిత్ షా చివరగా అవిశ్వాస తీర్మానంపై సమాధానమివ్వనున్నారు.
అధికార విపక్ష సభ్యుల మధ్య...
స్పీకర్ ఓం బిర్లా అవిశ్వాస తీర్మానం పై విపక్షాలు 118 సభ్యుల సంతకాలను సేకరించారు. టీఎంసీ అవిశ్వాసానికి మద్దతివ్వాలని నిర్ణయించింది. దీంతో నేడులోక్ సభలో అధికార,విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగే అవకాశముంది. స్పీకర్ ఓం బిర్లా అవిశ్వాస తీర్మనంపై చర్చ ముగిసేంత వరకూ సమావేశాలకుదూరంగా ఉంటానని ఇప్పటికే ప్రకటించారు.
Next Story

