Sat Mar 07 2026 18:58:54 GMT+0530 (India Standard Time)
Parliament : స్పీకర్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం... మోదీ సభ్యుడిగా ప్రమాణం
పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు

పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ముందుగా నరేంద్ర మోదీ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. 18 వ లోక్ సభలో తొలుత ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తర్వాత వరసగా కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.
26న స్పీకర్ ఎన్నిక...
జులై 3వ తేదీ వరకూ సమావేశాలు జరగనున్నాయి. 26వ తేదీన స్పీకర్ ఎన్నిక ఉండనుంది. ఈరోజు 280 మంది పార్లమెంటు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మిగిలిన పార్లమెంటు సభ్యులు రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు. స్పీకర్ ఎన్నిక కోసం అధికార ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు, రేపట్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది. బీజేపీకి చెందిన వారినే స్పీకర్ గా నియమిస్తారని ఢిల్లీలో ప్రచారం జరుగుతుంది.
Next Story

