Thu Mar 19 2026 18:22:23 GMT+0530 (India Standard Time)
నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు
పార్లమెంటు సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.

పార్లమెంటు సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాలు కావడంతో రెండు విడతలుగా సమావేశాలను నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. జనవరి 28 నుంచి బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. నేడు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
రెండు విడతలుగా...
నేటి నుంచి ఫిబ్రవరి 13 వరకు మొదటి దశ సమావేశాలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.మార్చి 9వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు రెండో విడత సమావేశాలు జరుగుతాయి. పార్లమెంటు సమావేశాలకు సంబంధించి ఉభయ సభల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు రాష్ట్రపతి ప్రసంగంపై తర్వాత సభలో చర్చిస్తారు.
Next Story

