Fri Dec 05 2025 11:08:35 GMT+0000 (Coordinated Universal Time)
రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు
రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాలను రెండు విడతలుగా నిర్వహించాలని నిర్ణయించారు.

రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాలను రెండు విడతలుగా నిర్వహించాలని నిర్ణయించారు. రేపు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగం జరిగే ప్రాంతంలో కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ నాటికి రాష్ట్రపతి పదవీ కాలం పూర్తి కానుంది. ఇదే ఆయన ఉభయ సభలను ఉద్దేశించి చివరిగా ప్రసంగించనున్నారు.
నేడు అఖిలపక్ష సమావేశం....
ఫిబ్రవరి ఒకటో తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభమవుతుంది. ఈరోజు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా అన్ని పార్టీల నేతలతో సమావేశం అవుతున్నారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని స్పీకర్ కోరనున్నారు.
Next Story

