Fri Dec 05 2025 14:57:40 GMT+0000 (Coordinated Universal Time)
రేపటితో ముగియనున్న గడువు.. వాఘా సరిహద్దు వద్ద క్యూ
వీసాల రద్దుతో పాక్ జాతీయులు భారత్‌ను వీడుతున్నారు. వాఘా సరిహద్దు వద్ద ఎక్కువ మంది ఉన్నారు

వీసాల రద్దుతో పాక్ జాతీయులు భారత్‌ను వీడుతున్నారు. పహాల్గాం ఘటన తర్వాత పాకిస్థానీయులు భారత్ లో ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలతో పాక్ కు చెందిన వారు వరసగా వారి దేశం వైపు పయనమయ్యారు. దీంతో వాఘా సరిహద్దు వద్ద ఎక్కువ మంది ఉన్నారు. వాఘా సరిహద్దు నుంచి 272 మంది పాక్ వెళ్లినట్లు అధికారులు తెలిపారు. సరిహద్దులకు చేరుకున్న వందలాది మంది పాకిస్తానీలు దేశం వదలి పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
పాక్ నుంచి...
పాక్ నుంచి స్వదేశానికి 629 మంది భారతీయులతో పాటు 13 మంది దౌత్యవేత్తలు భారత్‌కు చేరుకున్నారు. ఏప్రిల్ 29తో ముగుస్తున్న పాకిస్తానీల వీసా గడువు ముగుస్తుండటంతో పాకిస్థాన్ కు చెందిన వారు వరసగా భారత్ ను వీడుతున్నారు. వివిధ పనుల నిమిత్తం వచ్చిన పాక్ కు చెందిన వారు తమ దేశానికి బయలుదేరి వెళుతున్నారు. వివిధ వీసాలపై భారత్‌లో 10 వేల మంది పాక్ జాతీయులు ఉన్నట్లు అంచనా
Next Story

