Fri Dec 05 2025 11:38:05 GMT+0000 (Coordinated Universal Time)
జమ్మూలో డ్రోన్లతో దాడులకు తెగబడ్డ పాక్
జమ్మూలో డ్రోన్లతో పాకిస్తాన్ దాడులకు పాల్పడింది. అయితే భారత్ సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది

భారత్ - పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతలు మరింతగా తీవ్ర రూపం దాలుస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం జమ్మూ లక్ష్యంగా పాక్ డ్రోన్లతో దాడులకు ప్రయత్నించింది. జమ్మూలోని ఎయిర్ సిస్టమ్ ను పాక్ లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు దిగినట్లు సమాచారం. అయితే మన ఆర్మీ సమర్థవంతంగా దీనిని తిప్పికొట్టగలిగింది. ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్ లో ఇంటర్నెట్ సేవలను కూడా ప్రభుత్వం బంద్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. జమ్మూ నగరాన్ని బ్లాక్ అవుట్ చేశారు.
ఎఫ్ 16 ను కూల్చివేసిన భారత్ ఆర్మీ...
పాక్ డ్రోన్లను భారత్ సైన్యం కూల్చివేయడంతో ముప్పు తప్పింది. జమ్మూ కాశ్మీర్ లో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటు సాంబా జిల్లాలో పాక్ రేంజర్లు భారీగా కాల్పులకు తెగపడుతున్నాయి. కిష్త్వార్, అఖ్నూర్ సహా అనేక ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాను నిలిపేశారు. ఎఫ్ 16 ను కూడా ఇండియన్ ఆర్మీ కూల్చివేసినట్లు వార్తలు వస్తున్నాయి. పటాన్ కోట్ ఎయిర్ పోర్టుపై దాడికి వచ్చిన ఎఫ్ 16 యుద్ధ విమానాన్ని భారత వైమానిక దళం కూల్చి వేసింది. మొత్తం మీద సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Next Story

