Mon Mar 16 2026 11:02:27 GMT+0530 (India Standard Time)
నేడు రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానం
నేడు రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.

నేడు రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రకటించిన నేపథ్యంలో నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డు గ్రహీతలకు అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికయిన వారు రాష్ట్రపతి భవన్ కు చేరుకోనున్నారు.
అవార్డు అందుకోనున్న బాలకృష్ణ
అయితే నేడు నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకోనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ దంపతులు కూడా పాల్గొననున్నారు. వీరితో పాటు మిగిలిన పద్మ అవార్డు గ్రహీతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందచేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారితో పాటు కేంద్ర, రాష్ట్ర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Next Story

