Wed Mar 11 2026 20:17:57 GMT+0530 (India Standard Time)
లోక్ సభ స్పీకర్ పై వీగిన అవిశ్వాసం
లోక్ సభలో స్పీకర్ ఓంబిర్లాపై ప్రతిపక్ష పార్టీలు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది

లోక్ సభలో స్పీకర్ ఓంబిర్లాపై ప్రతిపక్ష పార్టీలు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మూజు వాణీ ఓటుతో వీగిపోయినట్లు ప్రకటించారు. స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్ష పార్టీల పట్ల సానుకూలంగా వ్యవహరించడం లేదని ఆరోపిస్తూ ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. దీనిపై చర్చ జరిగింది. విపక్ష సభ్యులతో పాటు అధికార పక్ష సభ్యులు కూడా తమ అభిప్రాయాలను తెలియజేశారు.
మూజువాణీ ఓటుతో ...
అయితే మూజువాణీ ఓటుతో స్పీకర్ పై పెట్టిన అవిశ్వాసం వీగిపోయిందని ప్రకటించారు. లోక్ సభ రేపటికి వాయిదా పడింది. లోక్ సభలో స్పీకర్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై 118 మంది విపక్ష సభ్యులు సంతకాలు చేసి ఇచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ కూడా ఈ అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చింది. అయితే చివరకు స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు ప్రకటించారు.
Next Story

