Fri Apr 10 2026 22:08:37 GMT+0530 (India Standard Time)
ప్రధాన ఎన్నికల కమిషనర్ పై అవిశ్వాసానికి
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలనే నోటీసుపై 193 మంది ప్రతిపక్ష ఎంపీలు సంతకం చేశారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలనే నోటీసుపై 193 మంది ప్రతిపక్ష ఎంపీలు సంతకం చేశారు. 130 మంది లోక్‌సభ ఎంపీలు, 63 మంది రాజ్యసభ ఎంపీలు సంతకాలు చేసిన వారిలో ఉన్నారు.నిబంధనల ప్రకారం, అటువంటి నోటీసుకు కనీసం 100 మంది లోక్‌సభ ఎంపీలు మరియు 50 మంది రాజ్యసభ ఎంపీల సంతకాలు అవసరం ఉంటుంది.
సంతకాలు చేసి...
ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించడానికి అవిశ్వాస తీర్మానం ప్రారంభించడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అవకతవకల కారణంగానే తాము అవిశ్వాసం నోటీసులు ఇవ్వనునట్లు విపక్ష సభ్యులు తెలిపారు. అయితే దీనిని అధికారపార్టీ వ్యతిరేకిస్తుంది.
Next Story

