Fri Mar 27 2026 18:43:44 GMT+0530 (India Standard Time)
నేడు లోక్‌సభ స్పీకర్‌పై విపక్షాల అవిశ్వాస తీర్మానం
నేడు లోక్‌సభ స్పీకర్‌పై విపక్షాల అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశముంది

నేడు లోక్‌సభ స్పీకర్‌పై విపక్షాల అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశముంది. ఇప్పటికే అవిశ్వాస తీర్మానంపై 103 సభ్యుల సంతకాలను సేకరించినట్లు తెలిసింది. రాలోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడనివ్వకుండా అడ్డుపడటంతో పాటు ఎనిమిది మహిళ పార్లమెంటు సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయడంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారని తెలిపారు.
స్పీకర్ ఓంబిర్లాపై...
ఇందుకోసం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో అన్ని పార్టీల నేతలతో చర్చించినట్లు తెలిసింది. రాహుల్ గాంధీ ప్రసంగానికి సభలో పదే పదే స్పీకర్ ఓంబిర్లా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అందుకోసం సభలో స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాసం పెట్టాలని విపక్షాలు నిర్ణయించినట్లు సమాచారం. ఈరోజు నోటీసులు ఇచ్చే అవకాశముందని తెలిసింది.
Next Story

