Thu Mar 19 2026 03:58:01 GMT+0530 (India Standard Time)
ఆపరేషన్ కావేరి : 250 మంది తరలింపు
సూడాన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కావేరి కొనసాగుతుంది

సూడాన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కావేరి కొనసాగుతుంది. ఇందులో భాగంగా రెండు యుద్ధ విమానాల ద్వారా మరో 250 మంది భారతీయులను తరలించారు. సూడాన్‌లో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేంద్రప్రభుత్వం తక్షణ చర్యలను ప్రారంభించింది.
సూడాన్ నుంచి...
అక్కడి నుంచి భారతీయులను రప్పించేందుకు ఆపరేషన్ కావేరిని ప్రారంభించింది. ఇప్పటికే అనేక మందిని సూడాన్ నుంచి భారత్ కు తరలించింది. ఇంకా కొంత మంది భారతీయులు సూడాన్‌లో చిక్కుకుపోయినట్లు పలు రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందుతుండటంతో మరిన్ని విమానాలను పంపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది.
Next Story

