Fri Dec 05 2025 22:19:12 GMT+0000 (Coordinated Universal Time)
Gujarat elctions: ఒక్క ఓటరు కోసం పోలింగ్ బూత్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఓటరు కోసం ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒక్క ఓటరు కోసం ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గిరి అడవుల్లో ఒకే ఒక ఓటరున్నారు. ఆ ఓటరు కోసం తాము పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు.
కంటైనర్ బూత్ కూడా...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈసారి ఎన్నికల కమిషన్ విన్నూత్న చర్యలు తీసుకుంటుంది. తొలిసారి షిప్పింగ్ కంటైనర్ లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 217 మంది కోసం ఈ పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు.
Next Story

