Thu Mar 19 2026 11:19:14 GMT+0530 (India Standard Time)
ఉగాది రోజు చేదువార్త
గత రెండు రోజులు వరసగా తగ్గిన బంగారం ధరల విషయంలో ఉగాది రోజున మాత్రం పసిడి ప్రియులకు చేదువార్త అందింది.

గత రెండు రోజులు వరసగా తగ్గిన బంగారం ధరల విషయంలో ఉగాది రోజున మాత్రం పసిడి ప్రియులకు చేదువార్త అందింది. ధరలు పెరిగాయి. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, కేంద్ర బడ్జెట్ లో కస్టమ్స్ డ్యూటీ పెంపుదల, బంగారం దిగుమతులను కేంద్ర ప్రభుత్వం తగ్గించడం వంటి కారణంగా బంగారం ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతూనే ఉన్నారు. వారి అంచనాలు నిజమవుతున్నాయి. పెరిగినప్పుడు భారీగా, తగ్గిననప్పుడు స్వల్పంగా బంగారం ధరలు తగ్గి పేద, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ వస్తుండటంతో బంగారం కొనుగోలు చేయడం కోసం ఎందరో ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బంగారం అందనంత ధరలకు చేరుతుండటం ఆందోళన కలిగిస్తుంది.
వెండి కూడా...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.200లు పెరిగింది. వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి పై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,000 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,000 రూపాయలుగా నమోదయింది. ఇక కిలో వెండి ధర 74,700 రూపాయలకు చేరుకుంది.
Next Story

