Wed Mar 18 2026 12:58:24 GMT+0530 (India Standard Time)
ఉద్వేగానికి గురైన రాహుల్
రక్షా బంధన్ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్వేగానికి లోనయ్యారు.

రక్షా బంధన్ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన తన సోదరితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రక్షా బంధన్ సందర్భంగా తన చిన్న నాటి స్మృతులను రాహుల్ గాంధీ గుర్తు చేసుకున్నారు. చిన్ననాటి నుంచి ఇప్పటి వరకూ జరుపుకున్న రక్షా బంధన్ ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఒకరికి ఒకరు....
చిన్న నాటి నుంచే ఇద్దరం ఒకరికి ఒకరు తోడుగా నిలిచామని, కష్టసుఖాల్లో అండగా ఉన్నామని పేర్కొన్నారు. తమ బంధం శాశ్వతమని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. కాగా అన్నాచెెల్లెళ్ల అనుబంధంగా నిలిచే రక్షాబంధన్ వేడుకను దేశ వ్యాప్తంగా అందరూ జరుపుకుంటున్న సంగతి తెెలిసిందే. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో తమ చిన్ననాటి ఫొటోలను కూడా షేర్ చేశారు.
Next Story

