Sat Mar 07 2026 19:19:13 GMT+0530 (India Standard Time)
భారత్ ను ఒణికిస్తున్న ఒమిక్రాన్.. పెరిగిన కేసులు
భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులుపెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో మొత్తం 653 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి

భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో మొత్తం 653 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 23 రాష్ట్రాలకు ఈ వేరియంట్ విస్తరించిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. తాజాగా పుదుచ్చేరిలోనూ రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రాలను అప్రమత్తం.....
ముఖ్యంగా మహారాష్ట్రలో అత్యధికంగా 167 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఆ తర్వాత ఢిల్లీలో 165 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 62 కేసులు నమోదయినట్లు అధికారులు ప్రకటించారు. భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తుండటంతో రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
Next Story

