Fri Jan 17 2025 07:31:04 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : దేశంలో మరో ఒమిక్రాన్ కేసు ..దీంతో ఐదుకు చేరిన...?
భారత్ లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
భారత్ లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. తాజాగా ఢిల్లీలో మరొక ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదయింది. దీంతో ఇప్పటి వరకూ భారత్ లో ఐదు ఒమిక్రాన్ కేసులు నమోదయినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
అప్రమత్తమైన....
మొన్న కర్ణాటకలో రెండు కేసులు, గుజరాత్ లో ఒకకేసు, నిన్న మహారాష్ట్రలో ఒక ఒమిక్రాన్ కేసు నమోదయింది. తాజాగా ఈరోజు ఢిల్లీలో ఈ కేసు నమోదయింది. వీరంతా సౌతాఫ్రికా నుంచి వచ్చిన వాళ్లే కావడం గమనార్హం. ఢిల్లీలో కేసు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది.
Next Story