Wed Mar 25 2026 11:28:53 GMT+0530 (India Standard Time)
గ్యాస్ బుకింగ్ లో నిబంధనలు కఠినం
సిలిండర్ బుకింగ్ రూల్స్‌ను మరింత ఆయిల్ కంపెనీలు కఠినతరం చేశాయి

సిలిండర్ బుకింగ్ రూల్స్‌ను మరింత ఆయిల్ కంపెనీలు కఠినతరం చేశాయి. డబుల్ సిలిండర్ ఉంటే 35 రోజుల తర్వాతే రీఫిల్ బుకింగ్ ఉంటుందని తెలిపారు. ఉజ్వల కనెక్షన్ ఉన్నవారికి 45 రోజుల తర్వాత బుకింగ్‌కు అనుమతి ఇస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
వీరికి మాత్రమే...
సింగిల్ సిలిండర్ ఉన్నవారికి మాత్రమే 25 రోజులకే బుకింగ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గడువుతేదీకి ముందే సిలిండర్ బుక్ చేస్తే ఆటోమెటిక్‌గా బుకింగ్ రద్దవుతుందని ప్రకటించారు. పీఎంయూవై వినియోగదారులకు సిలిండర్ బుకింగ్ గడువు 45 రోజులకు పెంపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు నిబంధన వర్తింప చేశారు.
Next Story

