Fri Dec 05 2025 14:35:48 GMT+0000 (Coordinated Universal Time)
సామాన్యులకు షాక్... పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
సామాన్య ప్రజలకు చమురు సంస్థలు మరోసారి షాక్ ఇచ్చాయి. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

సామాన్య, మధ్య తరగతి ప్రజలకు మరోసారి చమురు సంస్థలు మరోసారి షాక్ ఇచ్చాయి. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. వరసగా సిలిండర్ల ధరలను పెంచుకుంటూ చమురు సంస్థలు పోతున్నాయి. పెట్రోలు, డీజిల్ తో పాటు గ్యాస్ సిలిండర్ ధరలను కూడా ఇష్టారాజ్యం రీతిన చమురు సంస్థలు ధరలు పెంచుతున్నాయి.
పెరిగిన ధరలు...
తాజాగా పెరిగిన ధరలతో 1,055 ఉన్న సిలిండర్ ధర 1,105 చేరుకుంది. పెరిగిన ధరలు ఈరోజు నుంచే అమలులోకి వస్తాయని చమురు సంస్థలు చెప్పాయి. మరోవైపు గ్యాస్ సిలిండర్ ధరల పెంపుదలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై విపక్ష పార్టీలు కూడా విమర్శలు చేస్తున్నాయి.
Next Story

