Sat Mar 07 2026 16:19:35 GMT+0530 (India Standard Time)
ఉగాది రోజునూ పెట్రో వడ్డన
చమురు సంస్థలు పండగ అని కూడా చూసుకోవడం లేదు. వరసగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతూ పోతున్నాయి.

చమురు సంస్థలు పండగ అని కూడా చూసుకోవడం లేదు. వరసగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతూ పోతున్నాయి. ఉగాది రోజుకూడా పెట్రో ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయిం తీసుకున్నాయి. పెట్రోలు లీటరు పై 80 పైసలు, డీజిల్ లీటరుపై 85 పైసలు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
వరసగా పెంచుతూ...
వరసగా పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచుతూ పోతుండటంతో వినియోగదారులపై అదనపు భారం పడనుంది. లీటరు పెట్రోలు పై గత తొమ్మిది రోజుల నుంచి ఏడు రూపాయలకు పైగానే పెరిగింది. దీని ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి. అయినా చమురు సంస్థలు నిర్దయతో వ్యవహరిస్తూ పెట్రోలు ధరలు పెంచుకుంటూనే పోతున్నాయి.
Next Story

