Sun Feb 01 2026 18:04:48 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ తరహాలోనే.... నేడు ప్రమాణ స్వీకారం
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన మంత్రివర్గంలో భారీగా మార్పులు చేయాలని నిర్ణయించారు

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన మంత్రివర్గంలో భారీగా మార్పులు చేయాలని నిర్ణయించారు. పాలన మూడేళ్లు ముగియడంతో మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా మంత్రులందరి చేత మూకుమ్మడిగా రాజీనామా చేయించారు. ఈరోజు నవీన్ పట్నాయక్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. కొత్త వారికి అవకాశం కల్పించాలన్న ఉద్దేశ్యంతో నవీన్ పట్నాయక్ ఈ నిర్ణయంతీసుకున్నారని తెలిసింది.
ఎన్నికలను....
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కూడా ఇటీవల మంత్రులందరి చేత మూకుమ్మడి రాజీనామాలు చేయించి మంత్రి వర్గ విస్తరణ చేపట్టిన సంగతి తెలసిందే. అదే తరహాలో నవీన్ పట్నాయక్ కూడా మంత్రివర్గ సభ్యుల చేత రాజీనామా చేయించారు. స్పీకర్ సూర్యనారాయణ పాత్రో కూడా రాజీనామా చేశారు. ఆయనకు మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశాలున్నాయి. వరసగా గెలుస్తూ అందరినీ ఆదర్శంగా నిలుస్తున్న సీఎం నవీన్ పట్నాయక్ తొలిసారి ఇలా భారీగా మంత్రివర్గంలో మార్పులు చేస్తున్నారు. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గాన్ని నవీన్ పట్నాయక్ ఏర్పాటు చేస్తారని సమాచారం.
Next Story

