Fri Mar 20 2026 00:09:17 GMT+0530 (India Standard Time)
నేడు భారత్ లో రెండు లక్షలకు చేరువలో కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. 2 లక్షలకు చేరువలో ఉన్నాయి. కొత్తగా 1,94,720 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

భారత్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. రెండు లక్షలకు చేరువలో ఉన్నాయి. ఈరోజు కొత్తగా 1,94,720 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 442 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,56,22, 882 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
వ్యాక్సినేషన్ ...
ప్రస్తుతం దేశంలో 9,55,319 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 3,84,18,358 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,84,213 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,53,94,66,674 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది
Next Story

