Mon Dec 08 2025 22:20:19 GMT+0000 (Coordinated Universal Time)
స్థిరంగా కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతుంది. కేసుల సంఖ్య తగ్గడం లేదు. నిన్న 13,086 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు

భారత్ లో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతుంది. కేసుల సంఖ్య తగ్గడం లేదు. ఒక్కరోజులో 13,086 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 19 మంది కరోనా కారణంగా మరణించారు. నిన్నటితో పోలిస్తే కొంత తగ్గినా కేసులు సంఖ్య అనేక రాష్ట్రాల్లో పెరుగుతుందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 2.90 శాతానికి తగ్గింది. ఇది కొంత ఊరటనిచ్చే అంశమైనా యాక్టివ్ కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.26 శాతంగా ఉందని అధికారులు చెబుతున్నారు.
మరణాల సంఖ్య...
భారతో లో ఇప్పటి వరకూ 4,35,31,650 మంది కరోనా వైరస్ బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. కరోనా కారణంగా 5,25,242 మంది ఇప్పటి వరకూ మరణించారు. కరోనా వైరస్ బారిన పడి ఇప్పటి వరకూ 4,28,91,933 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 1,14,475 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు చెప్పారు. ఇక భారత్ లో కరోనా వ్యాక్సిన్ డోసులను ఇప్పటి వరకూ 1,98,09,87,178 వేశారు.
Next Story

