Sun Mar 15 2026 21:54:50 GMT+0530 (India Standard Time)
భారత్ లో రెండోరోజూ లక్ష దాటిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఈరోజు కొత్తగా 1,41,986 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

భారత్ లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఈరోజు కొత్తగా 1,41,986 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 285 మంది మరణించారు. వీటిలో అత్యధికంగా మహారాష్ట్రలో 20,185 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,50,22, 882 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు....
ప్రస్తుతం దేశంలో 4,72,169 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 3,56,18,358 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,82,852 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,50,60,76,774 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.
Next Story

