Thu Mar 19 2026 20:35:36 GMT+0530 (India Standard Time)
ఆంక్షలతో భారత్ లో తగ్గుతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఈరోజు 2,38,018 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 310 మంది మరణించారు

భారత్ లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఈరోజు కొత్తగా 2,38,018 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 310 మంది మరణించారు. రెండు రోజుల నుంచి స్వల్పం సంఖ్యలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. రాష్ట్రాలు కొన్ని ఆంక్షలు విధించడంతోనే కేసులు తగ్గుముఖంపడుతున్నాయి. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,62,42, 882 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు...
ప్రస్తుతం దేశంలో 17,36, 628 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,09,18,358 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,85,810 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,58,94,66,674 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకూ 8,891 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్ రేటు 14.43 శాతంగా ఉంది.
Next Story

