Thu Mar 19 2026 21:49:53 GMT+0530 (India Standard Time)
ఈరోజు స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఈరోజు కొత్తగా 2,58,089 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

భారత్ లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఈరోజు కొత్తగా 2,58,089 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 314 మంది మరణించారు. నిన్నటితో పోలిస్తే స్వల్పంగా కరోనా కేసులు తగ్గాయి. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,61,42, 882 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు...
ప్రస్తుతం దేశంలో 16,54,361 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,07,18,358 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,85,503 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,57,94,66,674 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకూ 8,209 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్ రేటు 19 శాతంగా ఉంది.
Next Story

