Sun Dec 14 2025 21:01:32 GMT+0000 (Coordinated Universal Time)
BJP : బీజేపీ కీలక నిర్ణయం.. నితిన్ నబీన్ కు కీలక పదవి
బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నికయ్యారు

బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నికయ్యారు. ఆయన బీహార్ మంత్రిగా పనిచేస్తున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు నితిన్ నబీన్ ను జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఈ మేకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం వెంటనే అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
బీహార్ మంత్రిగా...
బీహార్ లోని బాంకీపుర్ అసెంబ్లీ స్థానం నుంచి నితిన్ నబీన్ వరసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం నితీష్ కుమార్ కేబినెట్ లో రహదారులనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చూస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 2020 జనవరి నెలలో నియమితులయ్యారు. ఆయన పదవీ కాలం ఇప్పటికే ముగిసినా మరికొంత కాలం పొడిగించారు. అతి చిన్న వయసులో నితిన్ నబీన్ బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
Next Story

