Sun Feb 01 2026 05:18:45 GMT+0000 (Coordinated Universal Time)
Unidn budget : నేడు నిర్మలా సీతారామన్ బడ్జెట్ .. ఎవరికి ప్రయోజనం అంటే?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఉదయం 11 గంటలకు పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ 2026–27ను ప్రవేశపెట్టనున్నారు. నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.. భారత పార్లమెంటు చరిత్రలో ఇదే రికార్డు. మౌలిక వసతులు, స్థిరమైన అభివృద్ధి, గ్రామీణ రంగం, పన్ను సంస్కరణలు ప్రధానంగా ‘వికసిత్ భారత్’ లక్ష్యంగా ఈ బడ్జెట్ ఉండనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తొమ్మిదోసారి వరుస బడ్జెట్ ప్రవేశపెట్టడంతో నిర్మలా సీతారామన్ మరో రికార్డు సృష్టించనున్నారు.
వరసగా బడ్జెట్ లు...
నిరంతరంగా బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా ఆమె అత్యధిక కాలం సేవలందించిన ఆర్థిక మంత్రిగా నిలవనున్నారు. ఆర్థిక శాఖ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే 2019 జూలై 5న ఆమె తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది వార్షిక ఆర్థిక ప్రకటనను ఆమెనే ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలో గత ఆర్థిక మంత్రుల రికార్డులను దాటేశారు.దేశ చరిత్రలోనే అత్యంత పొడవైన బడ్జెట్ ప్రసంగం రికార్డూ నిర్మలా సీతారామన్ ఖాతాలోనే ఉంది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా 2020 ఫిబ్రవరి 1న ఆమె రెండు గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించారు.
తొమ్మిదోసారి ...
2019లో వలస పాలన కాలం నాటి బడ్జెట్ బ్రీఫ్కేస్కు ఆమె వీడ్కోలు పలికారు. ఎర్ర గుడ్డలో చుట్టిన సంప్రదాయ బహీ ఖాతాను ఆమె ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2021లో దేశంలో తొలిసారిగా పూర్తిగా పేపర్లెస్ బడ్జెట్ను ఆమె ప్రవేశపెట్టారు. డిజిటల్ ట్యాబ్ ద్వారా బడ్జెట్ పత్రాలను సమర్పించారు. అయితే నేడు బడ్జెట్ లో ఎవరికి ప్రయోజనాలుంటాయి? ఏ వస్తువులపై పన్ను విధించనున్నారు. ఏ వస్తువుల ధరలు తగ్గనున్నాయన్నది నేడు తేలనుంది. అలాగే రాష్ట్రాలకు కూడా ఏ రకమైన కేటాయింపులనేది ఈ బడ్జెట్ ద్వారా స్పష్టం కానుంది.
Next Story

