Sat Jan 10 2026 21:15:18 GMT+0000 (Coordinated Universal Time)
నేడు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థికమంత్రి
నేడు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం నిర్వహిస్తున్నారు

నేడు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం నిర్వహిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలోనిర్మలా సీతారామన్ ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక మంత్రులు హాజరై తమ ప్రతిపాదనలను కేంద్ర ముందు ఉంచనున్నారు.
బడ్జెట్ ప్రతిపాదనలపై...
బడ్జెట్ రూపకల్పన దృష్ట్యా రాష్ట్రాల అభిప్రాయాలు నిర్మలా సీతారామన్ తీసుకోనున్నారు. అలాగే బడ్జెట్ కు సంబంధించి ఆ యా రాష్ట్రాల వినతులను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకోనున్నారు. 'ప్రీ బడ్జెట్' సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్థికమంత్రులు పయ్యావుల కేశవ్, మల్లు భట్టివిక్రమార్కలు కూడా హాజరు కానున్నారు.
Next Story

