Wed Jan 28 2026 23:36:29 GMT+0000 (Coordinated Universal Time)
NIA Attacks : దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు.. వారి కోసమే
ఎన్ఐఏ దేశ వ్యాప్తంగా దాడులు చేస్తుంది. జైషే మహ్మద్ ఉగ్రవాద సానుభూతిపరుల ఇళ్లలో దాడలకు దిగింది

ఎన్ఐఏ దేశ వ్యాప్తంగా దాడులు చేస్తుంది. జైషే మహ్మద్ ఉగ్రవాద సానుభూతిపరుల ఇళ్లలో దాడలకు దిగింది. సోదాలు చేస్తుంది. మొత్తం ఈరోజు ఐదు రాష్ట్రాల్లో ఇరవై రెండు ప్రాంతాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి. ఇందులో ఢిల్లీ, అస్సాం, ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
నిధులను పంపేందుకు...
మహారాష్ట్రలోని మాలేగావ్ లో హోమియోపతి క్లినిక్ పై కూడా దాడులు నిర్వహించింది. పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ కు ఇక్కడి నుంచి నిధలను సేకరించి అందచేస్తున్నారన్న సమాచారంతో ఈ దాడులు నిర్వహిస్తుంది. భారత్ దేశంలో ఈ సంస్థకు ప్రత్యేక నెట్ వర్క్ ఉంది. ఇందుకోసం వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయడానికి ఎన్ఐఏ అధికారులు సిద్ధమయ్యారు.
Next Story

