Wed Dec 31 2025 03:56:09 GMT+0000 (Coordinated Universal Time)
New Year : కొత్త ఏడాది ఇవి చేస్తున్నారా? చేయకూడని పనులు ఏమంటే?
మరికొద్ది గంటల్లో కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం

మరికొద్ది గంటల్లో కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. కొత్త ఏడాదిలో కొత్త ఆశలు.. సరికొత్త ఆశయాలతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడమే కాకుండా 2026 సంవత్సరం అంతా హ్యాపీగా ఉండాలంటే కొన్ని విషయాలను వదిలేయాలి. కొన్నింటిని మన జీవనవిధానంలోకి తెచ్చుకోవాల్సి ఉంటుందని పలువురు సూచిస్తున్నారు. ఏటా డిసెంబరు 31వ తేదీ నాడు ఎన్నో హామీలు ఇస్తారు. వాటిని అమలు చేయడంలో మాత్రం కొందరే సఫలీకృతమవుతారు. మరికొందరు క్యాలండర్ మారినా.. క్యారెక్టర్ లో మాత్రం మార్పు రాదన్నది చాలా మంది నుంచి వినిపిస్తున్న మాట. అందుకే కొత్త ఏడాదిలో కొంగొత్త ఆశలతో అడుగు పెడుతున్న సందర్భంలో అనేక మంది ఆధ్మాత్మిక వేత్తలు, ప్రవచన కర్తలు పలు సూచనలు చేస్తున్నారు.
ఆవేశ నిర్ణయాలకంటే.. ఆచరించడమే...
ఆవేశంలో నిర్ణయాలను డిసెంబరు 31వ తేదీన ప్రకటించడం కంటే వాటిని ఆచరించడమే ముఖ్యమని పలువురు సూచిస్తున్నారు. చిన్నపాటి మార్పులతో జీవనాన్ని సాఫీగా మలుచుకోవచ్చని చెబుతున్నారు. ఒకేసారి పెద్ద మార్పులు కాకుండా, చిన్న చిన్న అలవాట్లతో ప్రారంభించాలంటున్నారు. రోజూ గంట సేపు వ్యాయామం చేయాలనుకునే బదులు, మొదట 30నిమిషాలతో మొదలుపెట్టాలని, బరువు తగ్గాలి అని అనుకుంటే, నెలకు రెండు కిలోలు తగ్గితే చాలని చెబుతున్నారు. అందకు స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫలితం వెంటనే రాకపోయినా నిరాశ చెందకుండా ప్రయత్నాన్ని పట్టుదలతో కొనసాగించాలి. పురోగతిని గమనించడం: మీరు సాధించిన చిన్న చిన్న విజయాలను ఒక డైరీలో రాసుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
లక్ష్యాలను సాధిచండానికి...
ఆచరణ సాధ్యమైన లక్ష్యాలను పెట్టుకుని ముందుకు సాగుతే ప్రతి ఒక్కరూ విజయం సాధించొచ్చు. చాలా మంది కొత్త సంవత్సరం రోజు కొత్త పనులతో పాటు పరివర్తన కోసం మంచి అలవాట్లు కూడా ప్రారంభిస్తారు. పరివర్తన అనేది ఒక్క రోజులో వచ్చేది కాదని, అది ప్రతిరోజూ మనం చేసే చిన్న చిన్న ప్రయత్నాల ఫలితంగా వస్తుందంటున్నారు. ప్రతికూల ఆలోచనల నుంచి సానుకూల దృక్పథం వైపు మళ్లడం, అనవసరమైన విషయాలకు కేటాయించే సమయాన్ని తగ్గించి, మన ఎదుగుదలకు ఉపయోగపడే పనులకు ప్రాధాన్యత ఇవ్వడం వంటివి చేయాలని సూచించారు.ప్రతిరోజూ కనీసం 15-20 నిమిషాలు ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడం లేదా మంచి పుస్తకం చదవడం.శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం (మెడిటేషన్, యోగా) పై దృష్టి సారించడం. ధూమపానం, మద్యపానం మరియు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండటం వల్ల ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన జీవితం కొత్త ఏడాది సాధ్యమవుతుందని సూచిస్తున్నారు.
Next Story

