Tue Dec 30 2025 05:32:31 GMT+0000 (Coordinated Universal Time)
కొత్త ఏడాది రాకముందే.. ఈ రెండు రోజుల్లో ఈ పనిచేయకుంటే మీకు తలెత్తే ఇబ్బందులివే
2026 కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి ప్రారంభం కానుంది. అంటే మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది

2026 కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి ప్రారంభం కానుంది. అంటే మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. కొత్త ఏడాది మరొక రెండు రోజుల్లో మొదలవుతుంది. అయితే సామాన్యుడి రోజువారీ ఖర్చులు, బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులు, గ్యాస్ ధరలు, జీతాలు, వాహన కొనుగోళ్లపై నేరుగా ప్రభావం చూపే కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఈ ప్రభావంతో సామాన్యుడి జేబుకు భారంగా మారుతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అంతేకాకుండా కొత్త ఏడాదిలో కొన్ని ముఖ్యమైన పనులు చేయాల్సి ఉంటుంది. అది చేయకుంటే మరిన్ని సమస్యలు ఎదురవుతాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నాు.
పాన్ –ఆధార్ లింకింగ్ ...
పాన్ –ఆధార్ లింకింగ్ ఆలస్యం చేస్తే పెద్ద సమస్య తలెత్తే అవకాశముందని అంటున్నారు. పాన్ కార్డు – ఆధార్ కార్డు లింక్ చేసుకునేందుకు ఇచ్చిన గడువు డిసెంబర్ 2025తో ముగియనుంది.ఈ లోపు లింక్ చేయకపోతే జనవరి 1, 2026 నుంచి పాన్ కార్డు పనిచేయదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. పాన్ పనిచేయకపోతే అనేక సమస్యలు తలెత్తుతాయి. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయలేరు. బ్యాంక్ లావాదేవీలకు అడ్డంకిగా మారనున్నాయి. మ్యూచువల్ ఫండ్లు, షేర్ల పెట్టుబడులు నిలిచిపోతాయి. భారీ మొత్తాల కొనుగోళ్లు చేయలేరు.
ప్రభుత్వ పథకాలు...
దీంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే కొన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కోల్పోయే ప్రమాదం ఉందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూపీఐ, ఎస్ఐఎం, , మెసేజింగ్ యాప్‌లపై కఠిన నియమాలు వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్న కొద్దీ ఆన్లైన్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. దీనిని అరికట్టేందుకు జనవరి 2026 నుంచి UPI భద్రతపై మరిన్ని కఠిన నియమాలు అమల్లోకి రావొచ్చని సమాచారం అందుతుంది. అందుకే ఈ రెండు రోజుల్లో పాన్ - ఆధార్ కార్డు లింక్ ను పూర్తి చేసుకుని అన్ని రకాల సమస్యల నుంచి బయటపడాలని సూచనలు వినిపిస్తున్నాయి. 2026 రావడానికి మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఈలోపు పూర్తి చేసుకోవాలని చెబుతున్నారు.
Next Story

