Sat Mar 07 2026 19:50:16 GMT+0530 (India Standard Time)
నీట్ పరీక్ష వాయిదా
మార్చి మూడో తేదీ జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను జులై 7వ తేదీకి వాయిదా వేశారు

మార్చి మూడో తేదీ జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను జులై 7వ తేదీకి వాయిదా వేశారు. మెడికల్ సైన్సెస్ నేషనల్ బోర్డు ఈ మేరకు ప్రకటించింది. నీట్ పీజీ పరీక్షను రీ షెడ్యూల్ చేస్తున్నట్లు ప్రకటించింది. అభ్యర్థులు దీనిని గమనించాలని అధికారులు కోరుతున్నారు. ఈ మేరకు బోర్డు నిన్న ఒక ప్రకటన చేయడం విశేషం.
కటాఫ్ తేదీని...
నీట్ పీజీ పరీక్ష వాస్తవానికి మార్చి 3వ తేదీన జరగాల్సి ఉంది. అయితే పరీక్షను జులై ఏడోతేదీన నిర్వహించనున్నారు. పరీక్ష రాసే అర్హత కటాఫ్ తేదీని కూడా నిర్ణయించారు. కటాఫ్ తేదీని ఆగస్టు 15వ తేదీగా నిర్ణయించింది. పీజీ వైద్య నిబంధనల ప్రకారం ఈ పరీక్ష జరగనుందని మెడికల్ సైన్సెస్ నేషనల్ బోర్డు తెలిపింది.
Next Story

