Sat Dec 13 2025 22:35:57 GMT+0000 (Coordinated Universal Time)
Bihar : బీహార్ లో బీజేపీ కూటమిది ఏకపక్ష విజయమే
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ఫలితాలు వస్తున్నాయి. మహా ఘట్ బంధన్ అభ్యర్థులు పూర్తిగా వెనకబడి ఉన్నారు. ప్రస్తుతం 186 స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉండగా, 55 స్థానాల్లో మహా ఘట్ బంధన్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. జేఎస్పీ కేవలం ఒక్క స్థానంలో కూడా ఆధిక్యత కనిపించడం లేదు. ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
ఎగ్జిట్ పోల్స్ ప్రకారం...
మ్యాజిక్ ఫిగర్ 122 స్థానాలు కావడంతో ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్థులు 186 స్థానాల్లో ఆధిక్యంలో ఉండటంతో అధికారానికి చేరువయింది. ఆర్జేడీకి అనుకూలంగా ఉందనుకుంటున్న సీమాంచల్ లోనూ ఎన్డీఏ అభ్యర్థుల విజయం దిశగా వెళుతుండటంతో ఇక మరోసారి ఎన్డీఏ బీహార్ పగ్గాలు చేపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీ కూటమి పార్టీలు ఏకపక్షంగా బీహార్ ఎన్నికలలో దూసుకుపోతున్నట్లు కనిపిస్తుంది.
Next Story

