Sat Dec 13 2025 22:33:09 GMT+0000 (Coordinated Universal Time)
Bihar : బీహార్ అసెంబ్లీలో ఎన్డీఏ ముందంజ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మహా ఘట్ బంధన్ అభ్యర్థులు కొంత వెనకబడి ఉన్నారు. పోస్టల్ బ్యాలట్ లోనూ ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం 104 స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉండగా, 73 స్థానాల్లో మహా ఘట్ బంధన్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. జేఎస్పీ కేవలం మూడు స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది. ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.
పోస్టల్ బ్యాలట్ లోనే...
పోస్టల్ బ్యాలట్ లోనే ఎన్డీఏ ఆధిక్యంలో ఉండటంతో ఈవీఎంలోనూ తమదే ఆధిక్యం కొనసాగుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కానీ ఈవీఎంలలో తమకే ఆధిక్యం లభిస్తుందని మహా ఘట్ బంధన్ దీమాను వ్యక్తం చేస్తుంది. మరొకవైపు జన్ సురాజ్ పార్టీ కూడా తాము ఈ ఎన్నికల్లో కీలకంగా మారబోతున్నామని చెబుతుంది. ఈవీఎంల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది.
Next Story

