Sat Dec 13 2025 22:33:16 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : బీహార్ లో మ్యాజిక్ ఫిగర్ దాటిన ఎన్డీఏ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మహా ఘట్ బంధన్ అభ్యర్థులు కొంత వెనకబడి ఉన్నారు. ప్రస్తుతం 124 స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉండగా, 104 స్థానాల్లో మహా ఘట్ బంధన్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. జేఎస్పీ కేవలం మూడు స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది. ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.
ఎగ్జిట్ పోల్స్ ప్రకారం...
మ్యాజిక్ ఫిగర్ 122 స్థానాలు కావడంతో ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్థులు 124 స్థానాల్లో ఆధిక్యంలో ఉండటంతో అధికారానికి దగ్గరగా వెళుతుంది. ఎగ్జిట్ పోల్స్ అంజనాలు నిజమవుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు అన్ని సంస్థలు ఎన్డీఏ విజయం సాధిస్తుందని తెలిపాయి. ప్రస్తుతం లెక్కింపులో కూడా అదే వేవ్ కొనసాగుతుంది.
Next Story

