Sat Dec 13 2025 22:33:08 GMT+0000 (Coordinated Universal Time)
Bihar : బీహార్ బీజేపీ కూటమిదే.. వార్ వన్ సైడ్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ఫలితాలు వచ్చాయి. మహా ఘట్ బంధన్ అభ్యర్థులు పూర్తిగా వెనకబడి పోయారు. ప్రస్తుతం 203 స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉండగా, 32 స్థానాల్లో మహా ఘట్ బంధన్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఎంజీబీ మూడు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా...
బీహార్ లో ఎన్నడూ లేని విధంగా ఫలితాలు రావడం విపక్ష పార్టీలను ఆశ్చర్యపర్చింది. ప్రజలు ఏకపక్షంగా బీజేపీ కూటమివైపు నిలిచారు. మోదీ చరిష్మా తగ్గలేదని మరొకసారి బీహార్ ఎన్నికలు నిరూపించినట్లయింది. ఇంత భారీ స్థాయిలో గతంలో ఎన్నడూ బీహార్ లో ఫలితాలు రాలేదు. ఈ ఓటమికి కారణాలు కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లోకి విపక్షాలు వెళ్లిపోయాయని చెప్పాలి.
Next Story

