Sun Mar 15 2026 22:19:55 GMT+0530 (India Standard Time)
ఆస్పత్రిలో చేరిన శరద్ పవార్
ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. తాజాగా.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎన్సీపీ ..

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. తాజాగా.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎన్సీపీ ప్రకటన విడుదల చేసింది. ఆరోగ్యం దెబ్బతినడంతో పవార్ ఆసుపత్రిలో చేరారని వెల్లడించింది. ఆసుపత్రి వెలుపల ఎన్సీపీకి చెందిన నేతలు కానీ, కార్యకర్తలు కానీ గుమికూడరాదని స్పష్టం చేసింది.
శరద్ పవార్ కోలుకుంటున్నారని, రెండ్రోజుల్లో డిశ్చార్జి అయ్యే అవకాశాలున్నాయని ఆ ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు, నవంబరు 4, 5 తేదీల్లో షిరిడీలో నిర్వహించే పార్టీ శిబిరాల్లోనూ శరద్ పవార్ పాల్గొంటారని తెలిపింది. మరోవైపు శరద్ పవార్ త్వరగా కోలుకోవాలని ఎన్సీపీ నేతలు, కార్యకర్తలు కోరుకుంటున్నారు.
Next Story

