Thu Mar 19 2026 07:45:09 GMT+0530 (India Standard Time)
ఎవరామాట అన్నది .. నిజం కాదు
రాష్ట్రపతి పదవికి తాను పోటీ చేయడం లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చెప్పారు. ఈ మేరకు ఆయన క్లారిటీ ఇచ్చారు.

రాష్ట్రపతి పదవికి తాను పోటీ చేయడం లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చెప్పారు. ఈ మేరకు ఆయన క్లారిటీ ఇచ్చారు. విపక్షాల తరుపును అభ్యర్థిని తాను కాదని ఆయన స్పష్టం చేశారు. ముంబైలో జరిగిన ఎన్సీపీ నేతలతో జరిగిన సమావేశంలో శరద్ పవార్ ప్రసంగించారు. తాను పోటీ చేయడంపై ఫుల్లు క్లారిటీ ఇచ్చారు. తాను రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయడం లేదని, అటువంటి ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని ఆయన కోరారు.
ప్రచారం జరుగుతుండటంతో....
రాష్ట్రపతి ఎన్నికలు వచ్చే నెల 18న జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విపక్షాల అభ్యర్థిగా శరద్ పవార్ ను పోటీ చేయించాలని భావిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. త్వరలోనే సోనియాతో కూడా సమావేశం అవుతారన్న కథనాలు వచ్చాయి. అయితే దీనిని శరద్ పవార్ ఖండించారు. తాను రేసులో లేనని స్పష్టం చేశారు. శరద్ పవార్ ను అభ్యర్థిగా నిలబెట్టాలని బీజేపీ కూడా భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
Next Story

