Mon Feb 02 2026 02:05:09 GMT+0000 (Coordinated Universal Time)
సిద్దూ ట్వీట్ తో షేక్ అయిన కాంగ్రెస్
పీసీసీ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన తర్వాత సిద్ధూ చేసిన ట్వీట్ కాంగ్రెస్ ను మరోసారి ఇబ్బందుల్లోకి నెట్టింది.

పీసీసీ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన తర్వాత నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన ట్వీట్ కాంగ్రెస్ ను మరోసారి ఇబ్బందుల్లోకి నెట్టింది. ఆయన సోనియా ఆదేశాల మేరకు ఇటీవలే పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ను ప్రశంసిస్తూ సిద్ధూ ట్వీట్ చేశారు. పంజాబ్ లో మాఫియా వ్యతిరేక శకం ప్రారంభమయిందని సిద్దూ ట్వీట్ చేశారు.
మాఫియా వ్యతిరేక శకం....
మొన్నటి వరకూ పంజాబ్ లో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయేనన్న విషయం ఈ కాంగ్రెస్ నేత మర్చిపోయినట్లుంది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సరికొత్త మాఫియా శకాన్ని ప్రారంభించారని, ప్రజా ప్రయోజన విధానాలతో ఆయన పంజాబ్ ను తిరిగి గాడిన పెడతారని ట్వీట్ చేయడం కాంగ్రెస్ లో చర్చనీయాంశమైంది. భగవంత్ మాన్ కు ఎప్పుడూ మంచే జరగాలని సిద్ధూ ఆకాంక్షించారు కూడా.
Next Story

