Thu Mar 19 2026 11:16:43 GMT+0530 (India Standard Time)
పదవికి సిద్ధూ రాజీనామా
పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఆయన రాజీనామా చేశారు

పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఆయన రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. అప్పటి వరకూ ముఖ్యమంత్రి గా ఉన్న చరణ్ జిత్ చన్నీ, సిద్ధూ కూడా ఓటమి పాలయ్యారు. ఐదేళ్లపాటు పంజాబ్ లో అధికారంలో ఉండి కనీస స్థానాలను సాధించలేకపోయారు. కేవలం 18 స్థానాలకే పరిమితమయ్యారు.
సోనియా ఆదేశం మేరకు....
దీంతో ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సమీక్షించిన సోనియా గాంధీ ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్ లు రాజీనామా చేయాలని ఆదేశించారు. ఈ మేరకు సిద్దూ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను హైకమాండ్ కు పంపారు.
Next Story

