Fri Dec 05 2025 12:25:42 GMT+0000 (Coordinated Universal Time)
అహ్మదాబాద్ లో ఎన్ఐఏ విచారణ
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కారణాలు తెలుసుకోవడానికి నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు చేరుకున్నారు

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కారణాలు తెలుసుకోవడానికి నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ మరో మృతదేహం కూడా లభ్యమయింది. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన వెంటనే ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కుట్రకోణంలో దర్యాప్తు...
ఇప్పటికే డీజీసీఏ తో పాటు అనేక దర్యాప్తు సంస్థలు విచారణ ప్రారంభించాయి. అయితే కుట్రకోణం ఏదైనా ఉందా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేయడానికి ఎన్ఐఏ అధికారుల వచ్చినట్లు తెలిసింది. అక్కడ ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించడంతో పాటు విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన రమేష్ విశ్వాస్ కుమార్ ను కూడా విచారించే అవకాశాలున్నాయి.
Next Story

