Sat Mar 21 2026 19:26:07 GMT+0530 (India Standard Time)
నేటి నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండు రోజుల పాటు జరగనున్నాయి

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండు రోజుల పాటు జరగనున్నాయి. నేటి నుంచి రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా ఈ ఏడాది జరిగే రాష్ట్రాల ఎన్నికలపై చర్చ జరగనుంది. అభ్యర్థుల ఎంపికతో పాటు అక్కడ ప్రచార వ్యూహంపై కూడా చర్చించే అవకాశముందని తెలిసింది.
పలు అంశాలపై...
ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు సాయంత్రం ప్రధాని మోదీ ప్రసంగంతో ముగియనున్నాయి. జేపీ నడ్డా పదవీ కాలాన్ని మరోసారి పొడిగించిన సంగతి తెలిసిందే. రాష్ట్రాల ఎన్నికలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించే అవకాశముంది.
Next Story

