Thu Mar 19 2026 18:24:39 GMT+0530 (India Standard Time)
నాసల్ వ్యాక్సిన్ ధర ఎంతంటే?
నాసల్ వ్యాక్సిన్ ధరను భారత్ బయోటిక్ సంస్థ ప్రకటించింది. ప్రయివేటు ఆసుపత్రుల్లో నాసల్ వ్యాక్సిన్ ధరను రూ.800లుగా నిర్ణయించింది

నాసల్ వ్యాక్సిన్ ధరను భారత్ బయోటిక్ సంస్థ ప్రకటించింది. ప్రయివేటు ఆసుపత్రుల్లో నాసల్ వ్యాక్సిన్ ధరను రూ.800లుగా నిర్ణయించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో దీని ధరనూ 325 రూపాయలుగా నిర్ణయించింది. ముక్కు ద్వారా కరోనా వ్యాక్సిన్ కు ప్రభుత్వం అనుమతివ్వడంతో భారత్ బయోటెక్ సంస్థ ధరలను నిర్ణయించింది.
ఫోర్త్ వేవ్ భయపెడుతుండటంతో...
ప్రస్తుతం కరోనా ఫోర్త్ వేవ్ అందరినీ భయపెడుతుంది. చైనాలో విజృంభిస్తున్న బీఎఫ్ 7 వేరియంట్ భారత్ లోకి కూడా ప్రవేశించే అవకాశముందన్న హెచ్చరికలతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలు కూడా బూస్టర్ డోస్ వేయించుకోవడానికి సిద్దమవుతున్నారు. రెండు డోసులు తీసుకున్న తర్వాత గ్యాప్ రావడంతో ఇమ్యునిటీ తగ్గే అవకాశముందన్న వైద్య నిపుణుల సూచనలతో బూస్టర్ డోస్ కు కూడా డిమాండ్ పెరిగింది.
Next Story

