Tue Feb 03 2026 06:52:56 GMT+0000 (Coordinated Universal Time)
మోదీ నేడు యూపీకి.. పది వేల కోట్ల...?
ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటించనున్నారు. పది వేల కోట్ల రూపాయల విలువైన పనులను ప్రారంభించనున్నారు

ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దాదాపు పది వేల కోట్ల రూపాయల విలువైన పనులను ప్రారంభించనున్నారు. ప్రధానంగా గొరఖ్ పూర్ లో్ ఫెర్టిలైజర్ ప్లాంట్ ను ప్రారంభించనున్నారు. శంకుస్థాపన చేసిన తర్వాత ఆరేళ్లకు దీని ప్రారంభోత్సవానికి మోదీ వెళుతున్నారు. ఈ ప్లాంట్ ద్వారా రోజుకు 3,850 టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుంది. పూర్వాంచల్ రైతులకు ఇది ఉపయోగకరం.
ఎన్నికలకు సమయం....
ఫెర్టిలైజర్ ప్లాంట్ తో పాటు ఎయిమ్స్ లో కూడా ప్రారంభోత్సవాలను మోదీ చేయనున్నారు. త్వరలో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు జరుగుతుండటంతో్ మోదీ తరచూ యూపీలో పర్యటిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో గెలవడం బీజేపీకి అవసరం. అంతేకాదు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలంటే యూపీని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే తరచూ మోడీ యూపీలో పర్యటిస్తున్నారు.
Next Story

