Sun Mar 15 2026 08:53:44 GMT+0530 (India Standard Time)
Narendra Modi : నేడు మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ
ప్రధానిగా నరేంద్ర మోదీ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మూడోసారి మోదీ ప్రదానిగా బాధ్యతలను స్వీకరించనున్నారు

ప్రధానిగా నరేంద్ర మోదీ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్ లో రాత్రి 7.15 నిమిషాలకు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడోసారి భారత్ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి దేశ, విదేశాల నుంచి అనేకమంది అతిథులకు ఆహ్వానాలు అందాయి. దీంతో ఢిల్లీ వ్యాప్తంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
మంత్రులుగా...
ప్రధానిగా నరేంద్ర మోదీతో పాటు కొద్ది సంఖ్యలో మాత్రమే కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలందరూ హాజరవుతున్నారు. రాష్ట్రపతి భవన్ అంతటా పోలీసులు మొహరించారు. భారత్ ను ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలిపేందుకు మోదీ మరోసారి ప్రధానిగా బాధ్యతలను స్వీకరించనున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. ఈ కార్యక్రమానికి సార్క్ అధినేతలు, ఇతర దేశాల ప్రధానులు కూడా హాజరవుతున్నారు.
Next Story

