Thu Mar 19 2026 02:03:35 GMT+0530 (India Standard Time)
Narendra Modi : రాష్ట్రపతిని కలిసిన నరేంద్ర మోదీ
మూడోసారి ప్రధానిగా బాధ్యతలను చేపట్టేందుకు నరేంద్ర మోదీ సిద్ధమవుతున్నారు. ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు

మూడోసారి ప్రధానిగా బాధ్యతలను చేపట్టేందుకు నరేంద్ర మోదీ సిద్ధమవుతున్నారు. ఆయన కొద్దిసేపటి క్రితం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరారు. ఎన్డీఏ పార్టీలు తమకు మద్దతిచ్చిన లేఖలను రాష్ట్రపతికి మోదీ అందచేశారు. దీంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు.
మూడోసారి అవకాశం...
ఎల్లుండి సాయంత్రం మూడోసారి తాను ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ తెలిపారు. ప్రజలకు తనకు మూడోసారి అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. వారి రుణం తీర్చుకునే అవకాశం తనకు దక్కిందన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు కూడా ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేలా తాను నిరంతరం పనిచేస్తానని, 24 గంటలు అందుబాటులో ఉంటానని తెలిపారు.
Next Story

