కట్టాల్సిందే.. కూరగాయల వ్యాపారికి 29 లక్షల జీఎస్టీ
కూరగాయల వ్యాపారికి 29 లక్షల రూపాయల జీఎస్టీ కట్టాలంటూ నోటీసులు అందాయి.

కూరగాయల వ్యాపారికి 29 లక్షల రూపాయల జీఎస్టీ కట్టాలంటూ నోటీసులు అందాయి. కర్ణాటకలోని హవేరికి చెందిన శంకర్‌గౌడ కూరగాయల దుకాణం నడుపుతున్నాడు. రైతుల నుంచి నేరుగా తాజా కూరగాయలను కొని తన దుకాణంలో విక్రయిస్తుంటాడు. అలాంటి వ్యక్తికి జీఎస్టీ 29 లక్షలు చెల్లించాలంటూ నోటీసులొచ్చాయి. నాలుగేళ్లుగా కూరగాయలు అమ్ముతున్న శంకర్‌గౌడ మొత్తం 1.63 కోట్ల రూపాయల లావాదేవీలు చేసినందున ఇప్పుడు జీఎస్టీ కట్టాలట. క్లియర్ టాక్స్ ప్రకారం తాజా పండ్లు, కూరగాయల విక్రయం జీఎస్టీ పరిధిలోకి రాదు. రైతుల నుంచి కొనుగోలు చేసి, ఎలాంటి ప్రాసెస్ చేయకుండా విక్రయించే ఈ వస్తువులకు జీఎస్టీ వర్తించదు. అయినా ఆదాయాన్ని బట్టి నోటీసులు ఇవ్వడమేంటని కూరగాయల వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. వ్యాపారి మొత్తం అమ్మకాలు ఒక నిర్దిష్ట పరిమితిని మించి ఉంటే, ఆధారాలు, రికార్డులను అడిగే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

