Sat Feb 14 2026 19:31:55 GMT+0530 (India Standard Time)
కూలిన మెట్రో పిల్లర్... శిధిలాల కింద
ముంబైలో మెట్రో పిల్లర్ కూలిపోయింది.

ముంబైలో మెట్రో పిల్లర్ కూలిపోయింది. కొనసాగుతున్న మెట్రో ప్రాజెక్టు పనుల్లో శనివారం మధ్యాహ్నం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ములుండ్ (వెస్ట్)లో ఈ ఘటన జరిగింది. ఎల్బీఎస్ రోడ్డుపై జాన్సన్ & జాన్సన్ కంపెనీ సమీపంలో నిర్మాణంలో ఉన్న మెట్రో స్తంభం సిమెంట్ భాగం అకస్మాత్తుగా కూలింది. అదే సమయంలో కిందుగా వెళ్తున్న ఆటోరిక్షాపై ఆ భాగం పడింది.ఆటోలో వెళుతున్న నలుగురికి గాయాలయ్యాయి.
వాహనాలు ధ్వంసం...
శిధిలాల కింద పడి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. నలుగురికి గాయాలయినట్లు తెలుస్తోంది. నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలడంతో శిధిలాల కింద కొందరు చిక్కుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం ఎలా జరిగింది? ఆటోలో ఉన్న వారి పరిస్థితి ఏమిటి అనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు. ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఆందోళన నెలకొంది. సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి.
Next Story

